వినాయకుడి పుట్టుకలో ఉన్న అసలు నిజాలు…!

ఈ వినాయక చవితి సందర్భంగా గణనాథ అనే పేరు వెనుకున్న కథ తెలుసుకుందాం.. అయితే ఈ కథను చిన్నప్పటి నుంచి ఎన్నో విధాలుగా విన్నాం. ఇక సినిమాలు సీరియల్స్ అయితే వినాయకుడి కథను ఎన్నో విధాలుగా డ్రమైతే చేసి ప్రజెంట్ చేశారు. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకుంటే వినాయకుడికి తొలి పూజ ఎందుకు చేస్తారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం.. వినాయకుడి కథకు సంబంధించి మీకు మూడు విషయాలు తెలియాలి. శివపురాణం కుమార్ కాండలో 13 వ అధ్యాయం నుంచి వినాయకుడి కథ మొదలవుతుంది. నారద ముని అడిగితే బ్రహ్మ శివపురాణంలో ఉన్న విషయాలన్నీ వివరిస్తుంటాడు. వినాయకుడి కథలో నారద ముని కూడా ఉంటాడు. కానీ నిత్యం ధ్యానంలో నిమగ్నమై బ్రహ్మచారిగా ఉండే శివుడు గృహస్తుడిగా అంటే ఒక ఫ్యామిలీ మెన్ గా మారి జీవించే వ్యక్తి కదా.. శివుడు సత్వ రజోతము అనే మూడు గుణాలకు అతీతుడు కానీ అతను చేసే లీలలు విజయవంతం అయ్యే వరకు అన్నీ తెలిసినా కూడా ఆ మూడు గుణాలకు ప్రభావితమైనట్టుగా నటిస్తాడు. ఈ కథలు యుద్ధంలో వినాయకుడు తన గధతో శివగణాలందరినీ కొట్టుకుంటూ వెళ్ళాడు. కొంతమందికి చేతులు కాళ్లు విరిగిపోయాయి. మరి కొంతమందికి తలలు పగిలిపోయాయి. దెబ్బలు తగిలిన వారు కింద పడిపోతే మిగతావారు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీశారు. వాళ్ళందరికీ ఒక్కసారిగా యమున్ని చూస్తున్న అనుభూతి కలిగింది.

Advertisement

ఈ విషయం తెలుసుకొని నారదముని ఇంద్రాది దేవతలు ఋషులతోపాటు బ్రాహ్మణ కూడా వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. అందరూ శివుడితో మీరు గుణాలకు అతీతులు కానీ ఏదో లీలలు ఉద్దేశించి సాత్విక రజసిక తామసిక రూపాలు ధరిస్తూ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఏ లీల రచిస్తున్నారు అంటూ సందేహబడ్డారు. తాను చేసే లీల గురించి ఏమీ చెప్పలేదు.. కానీ అప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ వివరించి బ్రహ్మతో నువ్వు ఒంటరిగా వెళ్లి ఆ పిల్లవాడిని అదుపు చేయి అని చెప్పాడు. వాస్తవాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో కళ్ళు మూసుకున్న బ్రహ్మ పురుషులు ముడులను వెంటబెట్టుకొని ఉమా పుత్రుడు దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మను చూసిన వెంటనే ఉమా పుత్రుడు తన మీదకు దూకి అతని మీసాలు గడ్డాలు లాగేసాడు. నన్ను క్షమించు నేను నీతో యుద్ధం చేయడానికి రాలేదు. కేవలం శాంతి ప్రయత్నం చేయడానికి వచ్చాను. అని బ్రహ్మ అన్నాడు. ఉమా పుత్రుడు ఆ మాటలు పట్టించుకోకుండా చేతిలో తన గద పట్టుకొని దాడి చేయబోయాడు.

Advertisement

అది చూసి బ్రహ్మతో పాటు ఇతర ఋషులు మునులు అందరూ పరుగు తీశారు. విషయం తెలుసుకున్న శివుడు ఈసారి ఇంద్రాది దేవతలను పంపించాడు. ఇందులో అతని కుమారుడు కార్తికేయుడు కూడా ఉన్నాడు. అయినా అందర్నీ ఓడించాడు వినాయకుడు. అప్పుడు శివుడు వచ్చి తనపై యుద్ధం చేస్తుండగా అసూలం దాడి చేయలేక కింద పడిపోయింది. అప్పుడు శివుడు పినాక అనే ధనుస్సుని ఎత్తాడు. కాని ఉమా పుత్రుడు శివుడి తలపై దాడి చేస్తే అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత విష్ణువు మళ్ళీ ముందుకొచ్చి ఉమా పుత్రుడితో యుద్ధం మొదలుపెట్టాడు. కాసేపటికి విష్ణువు కూడా ఇతని దాడి తట్టుకోలేక నేలరాలిపోయాడు. ఇదే అవకాశంగా భావించి శివుడు క్షణకాలంలో వచ్చి తన సూలంతో దాడి చేసి ఉమా పుత్రుడు తలను మొండి నుంచి వేరు చేశాడు. ఉమా పుత్రుడు చనిపోయాడు. అన్న వార్త తెలిసి పార్వతీ చాలా బాధపడింది. నా పుత్రుడిని చంపిన వారెవ్వరు బతికుండ కూడదు అని అంటూ కోపంతో రగిలిపోయింది. ఆ క్షణం ఆమె నుంచి వందల వేల శక్తి రూపాలు వచ్చి విధ్వంసాన్ని సృష్టించాయి. శివ కేశవులు బ్రహ్మ ఇంద్రాది దేవతలంతా ఇక ప్రళయం సంభవిస్తుందేమోనని భయపడ్డారు ఏదో ఒకటి చేసి పార్వతిని శాంత పరచాలనుకున్నారు బ్రహ్మ ఋషులు మునులను వెంటబెట్టుకొని పార్వతిని కలిసి మీ పుత్రుడిని మేమంతా కలిసి చంపినందుకు క్షమించండి.

ఇప్పుడు మీరు శాంతించాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు నా పుత్రుడు పునర్జీవితుడై అతనికంటూ ఒక ఉత్తమ స్థానాన్ని కల్పిస్తే నేను శాంతిస్తాను. అని పార్వతీ సమాధానమిచ్చింది వెంటనే బ్రహ్మ శివగణాలను పిలిచి ఉత్తర దిక్కున ప్రయాణించమని చెప్పి ఆ దిశలో మొట్టమొదట కలిసే వారి తలను మొండి నుంచి వేరుచేసి తీసుకురమ్మన్నారు బ్రహ్మ చెప్పినట్టే చేయడంతో ఒక ఏనుగు కనిపించింది దాని తలను తెంచి ఉమా పుత్రుడు అతికించారు. ఆ తరువాత బ్రహ్మ వేదమంత్రాలు చదివి పవిత్ర జలాన్ని ఆ శరీరంపై చల్లితే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అది చూసి పార్వతీదేవి సంతోషించింది. వెంటనే అతన్ని గణాలకు అధిపతిని చేసి గణాధిపతి గణనాథా గణేశా అనే పేర్లతో అత నికి గుర్తించింది. అప్పుడు వినాయకుడు అక్కడున్న త్రిమూర్తులు పార్వతీదేవికి నమస్కరించి అహంకారంతో హద్దు మీరు ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి.త్రిమూర్తులతో సమాన స్థాయిని ఇచ్చాడు.

అంటే ముల్లోకాల్లో త్రిమూర్తులను పూజించేవారు. సమాన రీతిలో విఘ్నేశ్వరుడికి కూడా పూజలు చేస్తారు. ఏ వ్రతంలోనైనా వినాయకుడికి పూజ చేయకుండా ఇతర దేవతలను పూజిస్తే ఆ వ్రతం అసంపూర్ణమని అలా చేసే వ్రతాలకు ఫలముండదు అని చెప్పాడు. ఇది జరిగిన తర్వాత శివుడు గణాధిపతిని తన రెండో పుత్రుడిగా అందరికీ ప్రకటించాడు దానితోపాటు వినాయక వ్రతం ఎలా చేస్తారని వివరించాడు ఇది శివపురాణం కుమారకాండలో 18 వ అధ్యాయంలో ఉంటుంది దీన్నే మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు పాటిస్తాం. ఆఖరిగా ఉమా పుత్రుడు గణాధిపతి అయిన సందర్భంగా అందరూ సంబరాలు చేసుకున్నారు..

Advertisement

Leave a Comment